Home » sivaratri : శివుడికి అభిషేకం వీటితోనే చేయండి.

sivaratri : శివుడికి అభిషేకం వీటితోనే చేయండి.

sivaratri : శివరాత్రి పండుగ పురస్కరించుకొని భక్తులు శివుడికి వివిధ రకాల పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఉపవాస దీక్ష చేస్తారు. జాగరణ ఉండి మరుసటి రోజు దీక్ష విరమణ చేస్తారు. వీటితో పాటు ఆలయాల్లో అభిషేకం కూడా చేస్తారు. ఇంటిలో కూడా భక్తి శ్రద్దలతో పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసే విధానం, ఏయే పదార్థాలతో అభిషేకం చేయవచ్చనేది వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు.

విభూదితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది.

నీటిలో పసుపు, కుంకుమ కలుపుకొని అభిషేకం చేస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

గరిక జలంతో శివుడిని అభిషేకం చేస్తే ఆర్థికంగా కలిసివస్తుంది.

నారికేళ జలంతో త్రినేత్రుడిని అభిషేకం చేస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

అన్నంతో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే సుఖ జీవనం కలుగుతుంది.

సువర్ణ జలంతో బోళా శంకరుణ్ణి అభిషేకం చేస్తే దరిద్రాలన్నీ పోతాయి.

రుద్రాక్షలతో శివుణ్ణి అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.

బిల్వపత్రితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి.

ఆవుపాలతో శివుణ్ణి అభిషేకం చేస్తే సుఖసంతోషాలతో ఉంటారు.

ఆవు నెయ్యితో త్రినేత్రుడిని అభిషేకం చేస్తే సిరిసంపదలు పెరుగుతాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *