Meerpeta : హైదరాబాద్ మీర్పేట మున్సిపాలిటీ ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. పెంచిన ఇంటిపన్నులను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఆమె మీర్పేట పట్టణవాసులు ఉద్దేశించి మాట్లాడుతూ…..
ప్రభుత్వం పెంచిన ఇంటిపన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఆధారంగా పన్ను కేటాయించకుండా, ఇష్టానుసారంగా పన్నులు కేటాయిస్తే ప్రజలు సహించేస్తితిలో లేరన్నారు. పెంచిన పన్నులను తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ మీర్పేట ప్రజలకు అండగా ఉంటుందన్నారు. పన్నులు తగ్గించని నేపథ్యంలో తమ పార్టీ చేపట్టే ఆందోళనలకు సంబంధిత అధికారులే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.