Target 3 members : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోరా, హోరి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు హామీలు ఇచ్చారు. ఆకట్టుకునే విదంగా కాంగ్రెస్, కూటమి, వైసీపీ పార్టీలు మేనిఫెస్టో ను ప్రజల ముందు పెట్టారు. జగన్ ను అడ్డుకోడానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ లు ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. ఆదేవిందంగా జగన్ తోవిభేదించిన చెల్లులు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టింది.
షర్మిల కూడా వైసీపీ ని ఇంటిదారి పట్టించడానికి కంకణం కట్టుకొంది.
వైసీపీ అధినేత జగన్ మాత్రం ఒంటిచేత్తో రెండు వర్గాలను ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున బస్సు యాత్ర చేస్తున్నారు. అదేవిదంగా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కలిసి మోదీ, ఇతర బీజేపీ పెద్దలు కలిసి రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రస్ అధ్యక్షురాలు షర్మిల కూడా తనదయిన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు మాత్రం ముగ్గురు నేతల ఓటమి లక్ష్యముగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ కుప్పం నుంచి పోటీచేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. అదేవిదంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ముగ్గురిని ఓడించడానికి వైసీపీ అధినేత జగన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటంలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం పంపిణి చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓటుకు నాలుగు వేల రూపాయలు కూడా పంపిణి చేస్తున్నట్టుగా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మద్యం, డబ్బు పంపిణి చేస్తున్నారు వైసీపీ నేతలు. మరోవైపీ కూటమి నాయకులతో కూడా బేరమాడుతున్నారు. వార్డు స్థాయి నాయకుల నుంచి మొదలు కొని నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి నేతల వరకు కొనడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపించడం విశేషం.