POW : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనవరి 24న ప్రగతిశీల మహిళ సంఘం (POW) ఐక్యత సభను నిర్వహించనున్నామని సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు డీ బుచ్చమ్మ తెలిపారు. గోదావరిఖని పట్టణంలోని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బావ సారూప్యత కలిగిన మహిళ సంస్థలన్నీ ఒకే తాటి మీదికి రావాలనే అభిప్రాయం బలంగా వ్యక్తం అయిందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు రాష్ట్ర కమిటిలుగా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఒకటి గా ఐక్యత కాబోతున్నాయని బుచ్చమ్మ వివరించారు. ఈ సభను విజయవంతం చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా బుచ్చమ్మ కోరారు. ఈ సందర్బంగ విలీన సభకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా కోశాధికారి ఈ మంగ తోపాటు బండ పద్మ, కుందారపు శారద, పీ సమ్మక్క, రాధక్క.తదితరులు పాల్గొన్నారు.