Home » CPI (ML ) : ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం–సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ

CPI (ML ) : ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాం–సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ

CPI (ML ) : సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ నాయకుడు పూనేం రమేష్ అరెస్టును ఖండిస్తూ గోదావరిఖని పైలాన్ చౌరస్తా వద్ద సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ పూనెం రమేష్ ను ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయితీ పరిధిలోని ఎల్లాపురంలో అనారోగ్యంతో ఒకరి ఇంటిలో విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో ఈ నెల 28న పోలీసులు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ పోడు భూముల రక్షణ కొరకు పోరాడుతున్న న్యూడెమోక్రసీ నాయకులపై పోలీస్ నిర్బంధాన్ని కొనసాగించడాన్ని ఆయన ఈ సందర్బంగా ఖండించారు. కామ్రేడ్ రమేష్ కు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని పలువురు నాయకులు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షులు మేరగు చంద్రయ్య, ఏఐకేఎంఎస్. జిల్లా అధ్యక్షులు మేరగు చంద్రయ్య తోపాటు నాయకులు ఏ వెంకన్న, ఇ నరేష్, బి అశోక్, కొల్లూరి మల్లేశ్, ఎం దుర్గయ్య, పైడిపల్లి రమేష్, సమ్మెట తిరుపతి, ఎం కొమరయ్య, ఐ సాంబయ్య, సదయ్య, ఏ చంద్రయ్య, జనార్ధన్, మాడ స్వామి, ఆటో సాయి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *