Singareni : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ , అధ్యక్షులు బుర్ర తిరుపతి , సహాయ కార్యదర్శి అప్రోజ్ ఖాన్ లు సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీతారామయ్య, రాజ్ కుమార్ లు మాట్లాడుతూ……
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు. హై పవర్ కమిటీ వేతనాలను అమలుచేసే వరకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మైన్స్ ఆక్ట్ ప్రకారం ప్రతి కాంట్రాక్టు కార్మికునికి వేతనంతో కూడిన సెలవులు, లీవులు, సిక్కుల ఇచ్చే విధంగా ఆదేశాలు జారీచేయాలన్నారు. గైర్హాజరు పేరిట కార్మికుల వద్ద నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నపెనాల్టీ సిస్టంను వెంటనే రద్దు చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ లలో పనిచేసే డ్రైవర్లను వోల్వో ఆపరేటర్లుగా గుర్తించి హై స్కిల్ల్డ్ వేతనాలు చెల్లించాలన్నారు.
సింగరేణి కార్మికులకు ఇస్తున్న అలవెన్స్లను కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాలని, ఓవర్ టైం అలవెన్స్ మరియు ఆదివారం డ్యూటీ చేస్తే అదనంగా వేతనం చెల్లించాలని కోరారు. ఓపెన్ కాస్ట్ లలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు కాంట్రాక్టర్లు టెండర్లో ఉన్న కార్మికుల కంటే అదనంగా కార్మికులను నియామకం చేసుకొని వారి వద్ద నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి కాంట్రాక్టర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న పనిని బట్టి సేమి స్కిల్డ్డ్, స్కిల్డ్ మరియు హైస్కిల్డ్డ్ వేతనాలు చెల్లించాలని కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.