Elachi : మసాలా దినుసులకు రారాజు యాలకులు. ఇది మంచి సువాసన ఉంటుంది. వీటిని స్వీట్స్, టీ తయారీలో వాడుతారు. మాంసా హారం వంటకాల్లో ఇలాచీ లేనిదే వంట చేయలేరు. కానీ ఇలాచీ తినడం వలన శరీరానికి చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాలకులను క్రమం తప్పకుండ తీసుకోవడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండెను ఆరోగ్యముగా ఉంచడంలో సహాయ పడుతుంది. అజీర్ణం, వాంతులు, వికారం ఉన్నవారికి మేలు చేస్తాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఎసిడిటిని తగ్గిస్తుంది.
యాలకుల్లో జింక్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ నుంచి శ్వాసను ఫ్రెష్ చేయడంలో ఎక్కువగా ఉపయోగ పడుతుంది. టీ. బొప్పట్లు, సేమియా, లడ్డు తయారీలో ఇలాచిని సువాసన కోసం వాడుతారు. ఇలా తియ్యటి పదార్తాల్లో తిన్నప్పటికీ కూడా శరీరానికి యాలకులు మేలు చేస్తాయి.