Singareni : INTUC సింగరేణి విభాగం కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా బన్న లక్ష్మణ్ దాస్ ను నియమిస్తూ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బన్న లక్ష్మణ్ దాస్ బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియా లోని కాసిపేట ఒకటో గనిలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి బన్న ఆశలు వారసత్వ రాజకీయంగా మొదటి నుంచి కూడా లక్ష్మణ్ దాస్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకవైపు పార్టీలో భాద్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సింగరేణిలో యూనియన్ కార్యకర్తగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.
గని ఫిట్ కమిటీలో వివిధ భాద్యతలు నిర్వహించిన లక్ష్మణ్ దాస్ కార్మిక రంగంతో పాటు, యూనియన్ భాద్యతలు నిర్వించారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర కమిటీ సింగరేణి విభాగంలో కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ ….
యూనియన్ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ భాద్యతలను తప్పకుండ నిర్వహిస్తానని తెలిపారు. మందమర్రి ఏరియాతో పాటు బెల్లంపల్లి రీజియన్ లో కూడా INTUC యూనియన్ ను మరింత బలోపేతం చేస్తానని అన్నారు. అదే విదంగా కార్మికుల అపరిష్కృత సమస్యలను కూడా కేంద్ర కమిటీ నాయకులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.