Sindhuram : ప్రస్తుత మార్కెట్లోని వివిధ దుకాణాల్లో నుదుట పెట్టుకునే బొట్టు లభిస్తుంది. పలు సంస్థలు ఒరిజినల్ బొట్టు తయారు చేస్తుండగా, మరికొన్ని సంస్థలు రసాయన పదార్థాలతో బొట్టు తయారు చేస్తున్నవి. ఈ రసాయన బొట్టు నుదుట పెట్టుకోవడం వలన చర్మ సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన ఇంటిలో ఉన్నటు వంటి పదార్థాలతోనే సింధూరం (బొట్టు) తయారు చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. ఇంటిలో తయారు చేసుకున్న రెండు చెంచాల పసుపు కు చిటికెడు పసుపు , ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా నిమ్మ రసం కలపాలి.
ఈ మిశ్రమాన్ని గ్రైండర్ లో వేసి మిక్సీ పట్టండి. దింతో ఆ మిశ్రమం అంతా కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. ఒక స్టీల్ ప్లేట్ లేదా రాగి ప్లేట్ లోకి ఎరుపు రంగులోకి మారిన మిశ్రమాన్ని తీసుకొని ఆరపెట్టండి. దింతో పొడిగా మారిన సిందూరాన్ని ( బొట్టు ) కుంకుమ భరణిలోకి తీసుకోని వాడుకోవచ్చు. ఇలా ఇంటిలో తయారు చేసుకున్న సిందూరంతో ఎలాంటి చర్మ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.