Allu Arjun : ప్రముఖ అల్లు అర్జున్ ను శుక్రవారం హైద్రాబాద్ లో పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అభిమానుల తాకిడి పెరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఇందుకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పడంతో పాటు నష్ట పరిహారం రూ: 25 లక్షలు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో పాటు అతని వ్యక్తిగత సిబ్బందితో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీస్ లు కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. దింతో అర్జున్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళకు గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అయన అభిమానులు సైతం ఆందోళన చెందారు. అదే విదంగా చిత్ర పరిశ్రమతో పాటు పుష్ప -2 చిత్ర బృందం ఆందోళన చెందుతోంది.