Home » Sai durga tej : సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే

Sai durga tej : సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే

Sai durga tej : సాయి దుర్గా తేజ్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ వేగంగా నడుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకం పై నిర్మిస్తున్న సినిమా పేరు ” సంబరాల ఏటిగట్టు “. రోహిత్ . కె. పి. దర్శకుడు. నిర్మాతలుగా నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఇటీవలనే పోరాటాలను పూర్తి చేశారు.

సాయి దుర్గా తేజ్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లతోపాటు మరో వెయ్యి మంది డ్యాన్సర్లతో పాటను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పాట ను ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా నిర్మిస్తున్నారు. సుమారు రూ : 125 కోట్లతో ” సంబరాల ఏటి గట్టు ” సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ తో పాటు డబ్బింగ్ కు సంబంధించిన అంశాలను కూడా వెంట. వెంట పూర్తి చేస్తున్నారు. సినిమాను ఒక రోజు ఐదు భాషల్లో సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నామని చిత్ర బృందం ప్రకటించింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *