self : దగ్గు, జలుబు, గొంతు నొప్పి. ఈ మూడింటితో ప్రతి ఒక్కరు తీవ్రంగా ఇబ్బంది పాడుతారు. డాక్టర్ ను సంప్రదిస్తారు. మందులు వేసుకుంటారు. కానీ ఆ మందులతో అవస్థ తగ్గుతుంది కావచ్చు. కానీ శరీరం మాత్రం మరింత క్షీనిస్తుంది. అటువంటప్పుడు మన చేతి వైద్యం తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మంచి అల్లం ముక్కలను స్వచ్చమైన తేనెలో కలిపి తినాలి. అల్లం ముక్కలు, తేనే తో తయారు చేసిన టీ తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. దగ్గును తేనె తొందరగా తగ్గిస్తుంది. పెద్దలు, పిల్లలు తేనె తాగడంలో ఎలాంటి ఇబ్బంది రాదు.
ఒక చెంచా తేనె కు పది చుక్కల అల్లం రసం కలపాలి. వేడి, వేడి లేమన్ టీ, గ్రీన్ టీ లో తేనె కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో స్వచ్ఛమైన పసుపు కలిపి తాగితే తొందరగా నయమవుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి ఈ చర్యల వలన తొందరగా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.