Good Benifit : దేశవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు. దీనితో ఎక్కడికక్కడే జనజీవనం స్థంభించి పోయింది. చిన్నతరహా పరిశ్రమలు, చిన్న, చిన్న వ్యాపారాలు కూడా స్థంభించి పోయాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు సైతం ముసురు వర్షాలతో తలపట్టుకోకతప్పలేదు. కానీ నిరంతరం కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెట్టుబడిదారులు మూడు రోజుల కిందట విడుదల చేసిన సినిమాకు ప్రేక్షకులు, అభిమానులు తండోపతండాలుగా తరలి రావడం విశేషం. బయట జోరుగా వర్షం కురుస్తుంటే, సినిమా థియేటర్లకు జనం జోరుగా రావడం విశేషం. కలెక్షన్ల వర్షం కూడా ఏకధాటిగా కురవడంతో పెట్టుబడిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
మూడు రోజుల కిందట అభిమానుల ముందుకు వచ్చిన ” డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ” అనే సినిమాకు ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విడుదల కావడానికి ముందే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అదేవిదంగా టీజర్, ట్రైలర్‌లు కూడా అభిమానులను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. హాలివుడ్ సినిమాలు చూసేవాళ్ళు తక్కువ. ట్రైలర్ చూసిన వాళ్లు విడుదల కోసం ఎదురుచూశారు.
హైదరాబాద్ లోని సినిమా దియెటర్లు నిండిపోతున్నాయి. సినిమా బుకింగ్స్ అదిరిపోతున్నాయి. సినిమా తెలుగు డబ్బింగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ” మార్వెల్ ” సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద టాక్ ఉంది. మార్వెల్ సినిమా విడుదల అయ్యిందంటే చాలు మిగతా సినిమా దియెటర్లు అన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి.
” డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ” సినిమా పెట్టుబడి కేవలం రూ.1675 కోట్లు మాత్రమే. అంత పెట్టుబడి పెట్టిన సినిమాకు కనీసం పెట్టుబడి అయినా వస్తుందా ? లేదా అనే అనుమానాలు సైతం పలు సినీపరిశ్రమలో వస్తాయి. కానీ మార్వెల్ నిర్మించే సినిమాలకు ఇది సాధరణ బడ్జెట్ అని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్. సినిమా విడుదల అయిన మొదటి వారంలోనే ఈ సినిమా ఏకంగా రూ.3650 కోట్లు కొల్లగొట్టి చిత్రపరిశ్రమలో అందరి అంచనాలు తలకిందులు చేసింది.