Srisylam : శ్రీశైలం భక్తులకు దేవస్థానం కమిటీ గొప్ప శుభవార్త ప్రకటించింది. కొత్తగా ఈఓ గా భాద్యతలు చేపట్టిన శ్రీనివాస రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దర్శనం విషయంలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం, సంక్రాంతి, దీపావళి, దసరా పండుగ సందర్భాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ సమయాల్లో భక్తులు స్పర్శ దర్శనం కోరుకుంటారు.
పండుగల సందర్భాల్లో స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం ఆలయ నిర్వాహకులకు ఇబ్బందిగా తయారైనది. గత కొన్ని రోజుల నుంచి భక్తులకు స్పర్శ దర్శనం లేదు. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి విమర్శలు రావడం మొదలైనది. కొత్తగ వచ్చిన ఈఓ శ్రీనివాస రావు ఎట్టకేలకు స్పర్శ దర్శనంపై దృష్టి సారించారు. ఆలయ కమిటీతో ఈఓ సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయ కమిటీ, అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. రద్దీ సమయాల్లో కూడా స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఈఓ శ్రీనివాస్ రావు ప్రకటించారు. భక్తుల రద్దీ ఉన్నప్పుడు నాలుగు విడితలుగా అలంకార దర్శనం, మూడు విడితల్లో స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పండుగల సమయాల్లో కూడా ఇప్పటి నుంచి భక్తులకు స్పర్శ దర్శనం అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.