Home » Auto Journy: కోట్ల ఆస్థి.. లెక్కలేనన్ని కార్లు…అయినా ఆటోలో ప్రయాణం

Auto Journy: కోట్ల ఆస్థి.. లెక్కలేనన్ని కార్లు…అయినా ఆటోలో ప్రయాణం

Auto Journy: ఆమె ఆస్థి ఎంత ఉందొ ఆమెకే తెలియదు. ఉండటానికి అందమైన ఇళ్లను దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంది. ఖరీదయిన కార్లు లెక్కలేనన్ని. అయినా ఆమె ఆ కార్లలో ప్రయాణం చేయడంలేదు. కార్లలో ప్రయాణించి బోర్ కొట్టింది కావచ్చు. ఆ అందాల భామ ఆటోలో ప్రయాణించింది.

ఒక్కసారిగా ఆమె ఆటోలో తిరగడాన్ని చూసిన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇన్ని రోజులు తిరిగిన కార్లు నిజంగా ఈమెవేనా ? లేదంటే అద్దెకు తీసుకున్నదా ? అనే అనుమానాలు జనం మెదడులో తలెత్తాయి. ఆ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ముంబయిలో ఇటీవల ఆటోలో ప్రయాణం చేసింది. కొందరు ఆమెను గుర్తుపట్టారు. మరికొందరు గుర్తుపట్టలేదు.

కోట్లాది రూపాయల ఆస్తి, ఖరీదయిన కార్లు. ఇన్ని ఉన్నప్పటికీ ఆమె ఆటోలో ప్రయాణించడం ఆశ్చర్యం వేసింది. ఇంతకూ ఆ అందాల ముద్దు గుమ్మ ఎవరంటే ప్రముఖ సినీ నటి అలియా బట్. ఆమె ఆటోలో ప్రయాణించిన ఫొటోలో సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం విశేషం. ఆ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యం చెందారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *