Chanakyudu : చాణక్యుడు చెప్పే నీతి సూత్రాల్లో నిజం దాగి ఉంది. నిత్యజీవితంలో ఆ సూత్రాలు ప్రతి వ్యక్తికి ఎంతో ఉపయోగ పడుతాయి. వాటిని పాటిస్తే ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని చాణక్యుడి బోధనలలో చెప్పబడింది. ప్రధానంగా ముగ్గురికి దూరంగా ఉన్న వారికి నిజజీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చాణక్యుడు తన బోధనలలో స్పష్టం చేశారు.
నిత్యం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కొనసాగించరాదు. అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి అందుబాటులో ఉన్నవారు తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. దింతో ఆర్థికంగా నష్టపోతారు. విలువైన సమయాన్ని కోల్పోతారు. చేయాల్సిన పనులు వాయిదా పడుతాయి.
పిరికివానికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. పిరికివానితో స్నేహం చేసిన నేపథ్యంలో వారు కూడా పిరికివానిలా తాయారు కావడం ఖాయం. ఎంత ధయిర్యం ఉన్నప్పటికీ మనం చేసుకునే పనుల్లో ముందుకు వెళ్లలేము. పిరికివాడు ముందుకు వెళ్ళలేడు. అతనితో ఉన్నవారిని కూడా ముందుకు వెళ్లనివ్వడు. దింతో అనేక విధాలుగా నష్టపోవడం తప్పదు.
తెలివైన అమ్మాయిని ఎంపిక చేసుకొని వివాహం చేసుకోవాలి. గుణవంతురాలు, విద్యావంతురాలు అయితేనే అతను, అతని పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. చదువు, సత్ప్రవర్తన లేని వారిని వివాహం చేసుకుంటే అతనితో పాటు అతని పిల్లలు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు తన నీతి శాస్త్రం లో చెప్పబడింది.