Home : వాస్తు పద్దతి ప్రకారమే ఇల్లు కట్టుకుంటాం. వేదం ప్రకారం గృహప్రవేశం చేస్తాం. ఇంటికి దిష్టిబొమ్మ కడుతాం. గుమ్మడికాయ కడుతాం. అయినప్పటికీ ఇంటి కుటుంబ సభ్యులందరు ఆరోగ్యాంగా, ఆర్థికంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ఇంటిలో ఐదు బొమ్మలను పెట్టుకుంటే నరదిష్ఠి ఉండదు. ఆరోగ్యాంగా ఉంటారు. ఆర్థికంగా ఏ లోటు రాదు. దింతో ఆ కుటుంబం అంతా కూడా అదృష్టవంతులే అవుతారని వేదం పండితులు చెబుతున్నారు.
తాబేలు అనేది ఒక జంతువు. ఇది నిలకడకు సంకేతం. అందుకనే ఇంటి ధనలక్ష్మి కూడా మన ఇంటిలోనే నిలకడగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇంటిలో తూర్పు ముఖం ఉండే విదంగా తాబేలు బొమ్మను పెట్టుకోవాలి. వ్యాపారస్తులు కూడా తమ దుకాణంలో పెట్టుకుంటే వ్యాపారం ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటుంది.
ఏనుగును లక్ష్మి దేవి వాహనంగా భావిస్తాం. ఏనుగు బొమ్మలు ఇంటిలో ఉంటే ఎల్లప్పుడూ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సాధ్యమైనంత మేరకు ఇంటిలో కానీ, పూజ గదిలో కానీ ఏనుగు బొమ్మ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
వేదంలో గుర్రాన్ని అశ్వినీ దేవతలుగా చెబుతారు. గుఱ్ఱం బలమైన జంతువూ. వేగంగా పనిచేసే సామర్ధ్యం ఉంటుంది. గుర్రం బొమ్మను ఇంటిలో పెట్టుకుంటే ఆ కుటుంబ సభ్యులపై ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇంటిలో గుర్రం బొమ్మ ఉంటే మేష రాశి వారికీ చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
కప్పకు ధనాన్ని ఆకర్షించే శక్తి, సామర్ధ్యాలు ఎక్కువగా ఉంటాయని వేదంలో చెప్పబడింది. బొమ్మలను గానీ ఇంట్లో ఉంచితే ఆర్థికంగా ఎదుగుతారు. ధనాన్ని ఆకర్షించడానికి,కప్పలకు ప్రత్యేక సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు.
ఇంటిలో ఉండే అక్వేరియంలో గోల్డ్ ఫిష్ ను పెంచుతారు. గోల్డ్ ఫిష్ తో పాటు వివిధ రకాల చేపలను కూడా పెంచుతారు. ఇంటిలో గోల్డ్ ఫిష్ పెంచడం వలన అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రశాంతత ఉంటుంది. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయని కూడా వేదంలో చెప్పబడింది.