ration dealer : ప్రభుత్వ చౌక ధరల దుకాణం డీలర్లకు ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం రూ : 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైద్రాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని రేషన్ డీలర్లు నిర్వహించారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన రేషన్ డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ డీలర్లు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఎన్నో ఏల్ల నుంచి వాళ్ళ సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సంబంధిత అధికారులతోపాటు, పలువురి రాజకీయ నాయకుల ఒత్తిడి తో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసన్నారు. కొత్తగా తెలంగాణ ఏర్పడింది. ప్రభుత్వాలు మరీనా డీలర్ల తలరాతలు మాత్రం మారడంలేదన్నారు.
రేషన్ డీలర్లకు, వారి కుటుంబ సబ్యులకు ఉచిత వైద్యం, ప్రతి నెల గౌరవ వేతనం రూ : 5 వేలు, క్వింటాలుకు రూ : 300 కమిషన్ ఇవ్వాలని ఈ సందర్బంగా రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత అధికారుల వేధింపులు ఉండరాదన్నారు. బస్తాలో బియ్యం క్వింటాలు కంటే తక్కువగా వస్తున్నాయని ఈ సందర్బంగా పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం తక్కువగా రావడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని ఈ సందర్బంగ ప్రభుత్వాన్ని కోరారు.