Devara cinema : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న దేవర పండుగ ముహూర్తం దగ్గరకు రానే వెచ్చేసింది. సెప్టెంబర్ 27 న అభిమానులు ముందుకు రాబోతోంది. దేవర సినిమా టికెట్ ధరలను ఎపి ప్రభుత్వం సవరించింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోడానికి దేవర చిత్ర బృందానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ లోని 29 సినిమా హాళ్లల్లో అదనపు ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 27న ఉదయం నాలుగు గంటలకు అదనపు షోతో సినిమా విడుదల కానుంది. ఆన్లైన్ లో టికెట్ లు ఈపాటికే బుకింగ్ కావడం విశేషం. తెలంగాణ లోని అన్ని సినిమా హాళ్లల్లో వంద రూపాయల టికెట్ పెంచడంతో పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .