Lakshmi Devi : జ్యేష్ఠ పూర్ణిమ రోజు పురస్కరించుకొని గంగా నది, గోదావరి నది లేదంటే సమీపంలో ఉన్నటువంటి ఏదయినా పవిత్రమైన నదిలో స్నానం చేయాలి. కొత్త దుస్తులు, లేదంటే ఉతికిన దుస్తులు ధరించాలి. ఉపవాసం సాధ్యమైనంతవరకు ఉండాలి. పూజ చేసేంతవరకు అయినా ఉపవాసం నియమంతో ఉండాలి. ఆర్థిక స్తోమత ప్రకారం దాన ధర్మాలు, ఉపవాసం, చంద్రుడికి నైవేద్యం జ్యేష్ఠ పూర్ణిమ రోజు చేయాలి.
పంచాంగం తిథుల ప్రకారం జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే ముహూర్త సమయానికి జూన్ 22, 2024 న ఉదయం 5:07 గంటలకు పౌర్ణమి గడియ ముగుస్తుంది. ఈ పూర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. చంద్రుడు పూర్ణ చంద్రుడి ఆకారంలో కనిపిస్తాడు. పవిత్రమైన ఏదయినా నదిలో స్నానం చేసిన తరువాత బ్రాహ్మణుడికి తెల్లని వస్త్రం, చక్కెర, బియ్యం, పెరుగు ను దానం చేసినచో పుణ్యం లభిస్తుంది. ఈ విదంగా చేయడంలో జాతకంలో చంద్రుని స్తానం ఉన్నవారి జీవితం ఏడాదిపాటు అనందంగా కొనసాగుతుందని వేదంలో చెప్పబడింది
జ్యేష్ఠ పూర్ణిమ రోజును పురస్కరించుకొని ఏదయినా నదిలో స్నానం చేసి లక్ష్మీ దేవిని, విష్ణు మూర్తిని ఉపవాసంతో ఉండి , భక్తి శ్రద్దలతో పూజించాలి. దింతో శుభ ఫలితాలు ప్రతి కుటుంబానికి అందుతాయి. అదేవిదంగా ఇంట్లో ఆర్థిక సంక్షోభం కనబడదని వేదంలో పేర్కొనబడింది.