Laxmi Narayana : శ్రీ లక్ష్మి నారాయణ రాజయోగం చాలా పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. వేదపండితులు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. సిరి సంపదలకు, విజయానికి, శ్రేయస్సుకు చిహ్నం అని చెప్పబడింది వేదంలో. వ్యక్తి జాతకంలో ఈ శ్రీ లక్ష్మి నారాయణ యోగం ఏర్పడినపుడు ఆ యాగం ఆతని జీవితాన్ని మార్చగలదు. ఆర్థిక పరిస్థితులతోపాటు, సామాజిక పరిస్థితులను కూడా మార్చే శక్తి దీనికి ఉంది. సిరి సంపదల అభివృద్ధిలో ఎంతో ప్రభావితం చేస్తుందని వేదంలో ఉంది.
విశ్వంలో తొమ్మిది గ్రహాలకు ప్రధానమైన స్థానం ఉంది. గ్రహాలు తమ కక్ష్యలో తిరుగుతూనే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు ప్రవేశిస్తాయి. గ్రహాలు సంచరించడంతో శుభం, అశుభం కలయికలు ఏర్పడుతాయి. ఈ కలయికలు అనేక రాశులపై ప్రభావం చూపుతాయి. జూన్ 12న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 14న బుధుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో లక్ష్మినారాయణ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
వృషభ రాశి : ఈ రాశి వారికి లక్ష్మి నారాయణ రాజయోగం ఏంతో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాల్లో ముందుకు వెళుతారు. ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటె తొందరలోనే పరిస్కారం అవుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కెరీర్ లో అభివృద్ధి అధికంగా ఉంటుంది.
సింహ రాశి : ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంది. రాజయోగం తిథి ప్రకారం ఈ రాశి వారు తమ కెరీర్ ను అభివృద్ధి చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. సిరిసంపదలు పెరుగుతాయి.
మకర రాశి: ఈ రాశి వారికి ఇంటిలో లక్ష్మీ నారాయణ రాజయోగం తో శుభం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. లాభాలు కూడా ఘనంగా సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. ఆర్థిక సంబంధాలు బలపడతాయి. పెట్టుబడులకు ఎంతో అనుకూలమైనది.