KCR POWER PURCHASE : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పెద్ద షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసు అందజేసినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ తో పాటు మరో 25 మందికి కూడా అదే అంశంపై నోటీసులు జారీచేసినట్టు నరసింహ రెడ్డి తెలిపారు. నోటీసు పై స్పందించిన కేసీఆర్ సమాధానం చెప్పేందుకు జూలై 30 వరకు గడువు కోరినట్టు జస్టిస్ నరసింహ రెడ్డి వివరించారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రముల నిర్మాణంతో పాటు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పంద విషయంలో కూడా గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణకు కమీషన్ ఏర్పాటైనది. జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ విచారణ చేపట్టింది. నోటీసులు అందుకున్న కేసీఆర్ వివరణ ఇచ్చేందుకు జులై 30వ తేదీ వరకు సమయం కోరారు. కానీ జూన్ 15వరకు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేని నేపథ్యంలో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని జస్టిస్ నరసింహరెడ్డి స్పష్టం చేశారు.