House : సొంతంగా నిర్మించుకున్న ఇంటిలో చిన్న, చిన్న వాస్తు దోషాలు ఏర్పడుతాయి. అవి మనకు తెలియకుండానే నిర్మాణం చేసేటప్పుడే జరిగిపోతుంటాయి. అటువంటి వాటి వలన ఇంటిలో చిన్న, చిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. వాటి వలన ఇంటిలో అశాంతి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి చిన్న దోషాలను సరిచేయవచ్చని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.
వంటగదిలో వెలుగులు తప్పనిసరిగా ఉండాలి. వెలుగులు అనేది శాంతికి చిహ్నం. విద్యుత్ బల్బులు నిత్యం వెలిగే విదంగా ఉండాలి. చిన్న బల్బు అయినా సరిపోతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీనివలన ఇంటిలోని ఇతర విభాగాల్లో కూడా అనుకూలమైన వాతావరణం కొనసాగుతుంది.
ప్రధాన ద్వారం ముందు భాగంలో గుర్రపు డెక్కను కట్టండి. ఈ గుర్రపు డెక్కను ఎర్రటి వస్త్రంలో కట్టాలి. దీనివలన వాస్తు దోషం సరవతుంది. అదే విదంగా నరదిష్ఠి ఉంటె కూడా తొలగిపోతుంది. ఇంటి మూల ప్రాంతాల్లో స్పటికం పెట్టండి. ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.