Team India Cricket : టీ -20 ప్రపంచ కప్ పోటీలను ఎన్నో దేశాలు నిర్వహించాయి. కానీ ఆతిధ్యం ఇచ్చిన ఏ ఒక్క దేశం క్రికెట్ జట్టు కూడా ప్రపంచ కప్ ను ఒక్క సారి కూడా సాధించలేదు. అత్యధికంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టీ -20 కప్ సాధించడం విశేషం. 2010, 2022 లో ఇంగ్లాండ్, 2012, 2016 లో వెస్టిండీస్ జట్లు విజేతలుగా నిలిచాయి. 2007 లో ఇండియా, 2009 లో పాకిస్తాన్ , 2014 లో శ్రీ లంక, 2021 లో ఆస్ట్రేలియా దేశాల జట్లు ఒక్కోసారి కప్ సాధించాయి. తాజాగా జరుగుతున్న పోటీల్లో 20 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. 2007 నుంచి 2012 వరకు 12 జట్లు, 2014 నుంచి 2022 వరకు 16 జట్లు పోటీలో ఉన్నాయి.
తాజా టీ -20 వరల్డ్ కప్ పోటీలో భారత్ జట్టు కూడా తలపడపోతోంది. ఇండియా టీమ్ కు మాత్రం మూడు జట్లతో పెద్ద తలనొప్పి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఆ మూడు జట్లతో ఇండియా జట్టుకు ముప్పు కూడా ఉందని చెప్పవచ్చు. అత్యంత దూకుడు స్వభావం ఉన్న మూడు జట్లు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా . ఈ మూడు జట్లను ఎదుర్కొంటే ఇండియా పెద్ద గండం నుంచి బయట పడినట్టే.
ఇంగ్లాండ్ జట్టు కప్ సాధించాలనే ఆశయంతో బరిలో దిగింది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అల్ రౌండర్ల బలం కూడా పుష్కలంగ ఉంది. ఇంగ్లాండ్ చేతిలోనే ఇండియా జట్టు పది వికెట్ల తేడాతో 2022 లో ఘోర పరాజయం పాలైనది. 2010, 2022 లో వరల్డ్ టీ -20 కప్ సాధించిన జట్టును తక్కువగా అంచనా వేస్తె పొరపాటుకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.
ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు చూడటానికి ఎలా కనిపించినా, ఆటతీరు మాత్రం కఠినంగానే ఉంటుంది. ప్రపంచ కప్ అంటే చాలు చాలా కసితో ఆడుతారు. అందరు ఐకమత్యంతో జట్టు కు విజయాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఒకరు కాకుంటే ఇంకొకరు జట్టును ఆదుకొని విజయాన్ని అందిస్తారు. ప్రతి వరల్డ్ కప్ ను సాధించాలనే పట్టుదలతో కసితో ఆడుతారు.
క్రికెట్ పోటీలు అంటే వీర బాదుడు బాదుతూ ఆడుతుంది వెస్టిండీస్ జట్టు. ఈ జట్టు ఆట తీరును అంచనా వేయలేము. ఇప్పటికే రెండుసార్లు టీ -20 వరల్డ్ కప్ సాధించి మూడోసారి సాధించాలనే కసితో ఉంది. తాజా పోటీలకు ఆతిధ్యం ఇంచింది. ఆతిధ్యం ఇచ్చిన దేశం జట్టుగా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది వెస్టిండీస్ జట్టు. 2012, 2016 లో వరల్డ్ కప్ టీ -20 సాధించి కసిమీద ఉంది. చూడటానికి మాములు జట్టు లా కనిపిస్తుంది. మైదానాల్లో అట చూస్తే మాత్రం మెరుపులు కురిపిస్తారు. తాజా పోటీలో కూడా ఆడుతూ చెలరేగి పోవడం ఖాయం.