Daily Running : శరీరానికి అన్ని భాగాలూ ముఖ్యమే. ప్రతి భాగం ఆరోగ్యముగా ఉంటేనే శరీరం సహకరిస్తుంది. అప్పుడే మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా రోజువారి పనులు చేసుకోగలుగుతాం. ఈ రోజుల్లో గుండె లో ఏర్పడే ఇబ్బందులతో అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. విపరీతంగా ఖర్చుల పాలవుతున్నారు. చికిత్స అందేలోపు కొందరు చనిపోతున్నారు. గుండె స్పందన తక్కువగా ఉంటె గుండె ఆరోగ్యముగా ఉందని అర్థం.
శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుకోడానికి చాలా మంది ఈ రోజుల్లో జిమ్ కు వెళుతున్నారు. మరి కొందరు నిత్యం యోగ చేస్తున్నారు. కొందరు ఇంటిలోనే వ్యాయామం చేస్తున్నారు. ఇంకా కొందరైతే మైదానంలో ఉదయం వాకింగ్ చేస్తారు. నెమ్మదిగా పరిగెత్తుతారు. ఇలా రక,రకాలుగా వ్యాయామం చేసి ఆరోగ్యముగా ఉండటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు వాళ్లకు తెలియకుండానే చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే గుండె జబ్బుతో. ఇది వైద్య పరీక్షల్లో స్పష్టం అవుతోంది. మరిఈ గుండె జబ్బు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఇప్పటిగే గుండెలో సమస్య ఉన్నవారు అయితే ఏమి చేయాలి. ఒక్కటే పరిస్కారం. ఆ పరిస్కార మార్గమే రన్నింగ్. ఉదయం లేదా సాయంత్రం రన్నింగ్ చేయడమే.
ప్రతిరోజు కనీసం పది నిముషాలు పరుగెత్తితే చాలు మీ గుండె ఆరోగ్యముగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క గుండెకే కాదు, శరీరంలోని అన్ని భాగాలు కూడా ఆరోగ్యాంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. హృదయ స్పందన కూడా తక్కువ అవుతుంది. దింతో గుండెలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. హృదయ స్పందన తక్కువగా ఉంటె గుండె లో ఎలాంటి లోపం లేనట్టు. ప్రతిరోజు పరుగెత్తేవారిలో గుండె సమస్యలు రావడంలేదని, చనిపోయే వారి సంఖ్య కూడా ఇటీవల తగ్గిందని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.