గేట్లు తెరిచామంటున్న సీఎం
20 మంది టచ్ లో ఉన్నారంటున్న కేసీఆర్
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మీరు,మీరు ఒకటి అంటే,కాదు మీరు,మేరే ఒకటి అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎన్నికల్లో కనీసం సగం స్థానాల్లో అయినా గెలిచి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.రెండంకెల స్థానాల్లో గెలిచి 2029 ఎన్నికల నాటికి పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి కాషాయం పెద్దలు తెలంగాణలో విస్తృత ప్రయత్నం చేస్తున్నారు.అధికారంలోకి వచ్చిన ఊపులో సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాల్లో విజయం సాధించి ఢిల్లీలో మరోసారి తను అంటే ఏమిటో చూపించాలని ప్రచారంలో దూసుకువెళుతున్నాడు.ఇదిలా ఉండగా ప్రస్తుతము తెలంగాణ భవన్ ను ఖాళీ చేయించడానికి సీఎం గాంధీ భవన్ గేట్లు తెరిచి ఉంచాడు.మాజీ సీఎం కేసీఆర్ నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో పెద్ద దుమారం వస్తుందని కేసీఆర్ అంటున్నారు.టచ్ లో ఉన్నారని కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోపే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గాంధీ భవన్ చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం.ప్రకాష్ గౌడ్ ప్రవేశంతో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుకొంది.మరికొందరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సహంగ ఉన్నారు.ప్రకాష్ గౌడ్ చేరికతో ఎవరు ఎవరికి టచ్ లో ఉన్నారనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది.
ఎవరు ఏ గూటిలో ఉంటారో…….
ఇప్పటికే గ్రేటర్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేశవరావు కూడా తిరిగి సొంత ఇంటిలో గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తం కోసం వేచిఉన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ గూటికి చేరి,ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు.ఈ ప్రభుత్వం ఆరునెలలు కూడా ఉండదు, సీఎం రేవంత్ రెడ్డి, నేను ఒకే బడిలో చదువుకున్నాం అంటూ వ్యంగంగా అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడిండు.తన కూతురుకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ నుంచి ఆమోదం పొందాడు.అది జరిగిన కొద్ధి గంటలకే కడియం కూతురితో సహా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం శోచనీయం. సాయంత్రం సీఎంను విమర్శిస్తున్నారు… తెల్లవారితే ఆయనతోనే మేడలో కండువా వేసుకుంటున్నారు..పదేళ్ళపాటు తన నీడన ఉన్న నాయకులను కాపాడుకోడానికి కేసీఆర్ కు కత్తిమీది సాములా తయారైనది.కాపాడుకొని నేపథ్యంలో పార్టీ ఉనికి సూన్యస్థానంలోకి వెళ్లడం ఖాయం. కనీసం ఐదు స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. కానీ సర్వే లు మాత్రం గతంలో సాధించిన రెండు సీట్ల మాదిరిగానే తాజాగా రెండు సీట్లకే కేసీఆర్ పార్టీ పరిమితం అవుతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో గులాబీ కండువా కప్పుకొని గెలిచిన వారు,ఓడిన నాయకులు ఎప్పుడు ఏ గూటిలో చేరుతారో తెలియడం లేదు.కానీ ఒక్కటి మాత్రం వాస్తవం జరుగుతోంది. ఎవరికి ఎవరు టచ్ లో ఉన్నారనేది మాత్రం తెలంగాణ ప్రజలకు స్పష్టమైపోయింది.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-