కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోల్పోయి తెలంగాణ భవన్ బాట పట్టారు పార్టీ శ్రేణులు.ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడైనా పార్టీని కాపాడుకోకపోతే ఉద్యమ పార్టీగా నిలిచిన పార్టీ ఉత్తదయిపోతుంది.కాబట్టి పార్టీని కాపాడుకోవాలంటే ఎదో ఒక ముచ్చటతో ప్రజల్లోకి వెళ్ళాలి.అందుకే బస్సు యాత్ర చేపట్టిండు గులాబీ బాస్ కేసీఆర్. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఎవరికోసం ఈ బస్సు యాత్ర అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రగతి భవన్ సచివాలయం అయ్యింది. …
కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంకు అండగా నిలిచింది సింగరేణి బొగ్గుగని కార్మికులు. ఆర్టీసీ. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు.కాంగ్రెస్ అధికారం చేపట్టింది. నీ పదేళ్ల అధికారం అందనంత దూరం పోయింది. ఇదే అక్కసుతో కరువు,తాగునీరు,కరెంట్ సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతున్నారంటూ ఎంతో ఆవేదన ఉన్న నాయకుడిగా బస్సు యాత్ర చేపట్టావు.సింగరేణిలో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదు.ఏ ఒక్కనాడైనా సింగరేణి గనిని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగితెలుసుకున్నావా. నీవు పురుడు పోసిన కార్మిక సంఘం అడ్డు అదుపు లేకుండా గని కార్మికులను వేధిస్తే ఏనాడైనా పట్టించుకున్నావా ??. అంతెందుకు కార్మికుల ఓట్లతో గెలిచిన నీ ఎమ్మెల్యేలు ఏనాడైనా బాయి బాట పట్టారా. ఉద్యోగ,ఉపాధ్యా సంఘాలకు ఏనాడైనా సకాలంలో డీఏ ప్రకటించావా ? ఎంతో మంది విద్యార్థులు ఇంటర్ మార్కుల్లో తేడాలు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క విద్యార్ధి కుటుంబంనైనా ఓదార్చావా ? కేవలం నీ ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలు దుఃఖంలో ఉంటేనే ప్రగతి భవన్ గడప దాటినావు.పరిస్థితులు చేయిదాటి ఎక్కడైనా అనుకోని సంఘటనలు జరిగితే నీ కొడుకు,లేదా నీ అల్లుడు వచ్చి పరామర్శించారు. కానీ మీరు మాత్రం ప్రగతి భవన్ నే రాష్ట్రానికి ప్రధాన కార్యాలయం చేసుకొని పరిపాలన చేసిన రోజులు చరిత్రలో నిలిచిపోయే విదంగా రాష్ట్రాన్ని పరిపాలించావు.
గెలిస్తే నేనే …
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందంటే జనంలో కలిసిపోయేది. ఉదయం చల్లబడిందంటే ఇంటికే పరిమిత అయ్యేది. అప్ ఎన్నికలు వచ్చాయంటే మల్లి రోడ్డెక్కేది. ఒకవేళ ఆ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైతే ముఖం చాటేసేది.కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఉద్యమ నేత కేసీఆర్ కు సీఎం కేసీఆర్ అనే పదానికి ఎంత తేడా ఉందొ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాక అంత తేడా వచ్చింది ఆయనలో. కనీసం కంటిచూపుతోనైనా చూద్దామన్నా నాయకులకు కూడా కేసీఆర్ కరువై పోయారు.అంతెందుకు ఆయన బి ఫారం ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలకు,మంత్రులుగా నియామకం అయిన వారికి కూడా కంటికి కనబడనంత దూరంలోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో సహకరించిన గద్దర్ ముఖ్యమంత్రిని చూద్దామని వెళితే కూడా దర్శన భాగ్యం లభించలేదు.నాణానికి రెండు బొమ్మలు ఉంటాయి కానీ కేసీఆర్ అనే నాణానికి మాత్రం కేసీఆర్ బొమ్మ ఒకటే ఉంటది.
పార్టీని కాపాడుకోకతప్పదు ….
అసెంబ్లీ ఎన్నికలు చేయిదాటిపోయాయి. ఇప్పుడు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సగం మందిని అయినా చేతిలో పెట్టుకోవాలి. అది జరిగితేనే పార్టీ నిలదొక్కుకుంటది. లేదంటే ఉద్యమ పార్టీ 2029 నాటికి ఉప్పుకు కూడా పనికిరాకుండా పోతుంది.పార్టీని విడిచి ఎవరు ఎప్పుడు వెలుతారో తెలియని పరిస్థితి ఉంది.అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన కడియం శ్రీహరి కూతురుతో సహా వెళ్లి కాంగ్రెస్ కండువే కప్పుకున్నాడు.పార్టీని నిబెట్టుకోవాలంటే ఎదో ఒక ప్రకంపన చేయాలి.అందుకే కరువు,రైతు గోస,తాగునీటిసమస్య,కరెంట్ కోతల పేరిట బస్సు యాత్ర చేపట్టి పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించు కోడానికి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు ఏ మేరకు సఫలమవుతాయో వేచిచూడాల్సిందే.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-