కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్
తమ్ముళ్లు…. మీ జగన్ అన్నకు చెప్పండి… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది సిద్ధం కాదని. యుద్ధమని చెప్పండి. మీ అన్న జగన్ కు నాకు జరుగుతున్నది యుద్ధం.ఈ యుద్ధంలో గెలుపు ఓటమిలను ప్రజలు నిర్ణయించబోతున్నారు.మీ ముఖ్యమంత్రి జగన్ ను ఇంటికి పంపడానికే నాతో పాటు ఇక్కడి ప్రజలు సిద్ధమయ్యారు.ఈ విషయాన్నీ మీ నాయకుడికి చెప్పండి. ఆదోనిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం చేపట్టారు.ఈ సందర్బంగ ఆమెకు వైసీపీ జెండాలను చూపెడుతూ సిద్ధం, సిద్ధం అనే బ్యానర్లను సైతంచూపుతూ విమర్శించారు.దీన్ని గమనించిన షర్మిల పై విదంగా మాట్లాడారు.దేనికి మీ నాయకుడు సిద్దమయ్యాడు. బిజెపి నాయకులకు, వాళ్ళ కార్యాలయాల్లో సేవలు చేయడానికి జగన్ సిద్దమయ్యాడా ?. మల్లి రైతులను గోసపెట్టడానికి సిద్దమయ్యాడా ? నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యాడా ? రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి మీ జగన్ అన్న సిద్దమయ్యాడా ? అంటూ బ్యానర్లు ఊపుతూ ప్రచారాన్ని అడ్డుకుంటున్న వైసిపి నాయకులను షర్మిల నిలదీయడంతో అక్కడినుంచి వెళ్లకతప్పలేదు.
మింగుడుపడని షర్మిల ప్రచారం….
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల చేస్తున్న ప్రచారం వైసిపి నాయకులకు మింగుడు పడటంలేదు.అంతేకాదు సోదరుడు ఆయిన జగన్ కూడా ఏమిచేయాలో అంతుపట్టక ప్రచారానికి కొత్త దారి వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చెల్లెలు షర్మిలను ఎదో ఓకే పద్దతిలో ఎదుర్కోక పొతే సీఎం జగన్ తన విజయావకాశాలపై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.షర్మిల మాత్రం ఎక్కడ ప్రచారం.చేపట్టినా తన అన్ననే లక్ష్యముగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది.ప్రచారంలో అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురైనా విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది.తెలంగాణ లో పార్టీ పెట్టినప్పటికిని షర్మిల ఆశించిన ఫలితాలు పెద్దగా రాలేదు. తిరిగి పుట్టింటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరింది. పార్టీ పగ్గాలు చేపట్టింది.వచ్చి రాగానే ఆమెకు ఎన్నికల యుద్ధం అన్నతోనే మొదలైనది.ఒకవైపు బీజేపీ,జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమిని ఎదుర్కొంటూనే, మరోవైపు అధికార పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందనంత లోతుల్లోకి వెళ్ళింది.అంత లోతుల్లోకి వెళ్లిన పార్టీని ఎంతవరకు పైకి తీసుకురాగలుగుతుందనేది రాజకీయ వర్గాల్లో తలెత్తిన ప్రశ్నకు షర్మిల ఏమేరకు సమాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-