Milk : పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు పెరుగుతారని అంటారు. కానీ బరువు పెరుగుతారనేది తప్పు. ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలియక చాలా మంది సమయం, సందర్భం లేకుండా పాలు తాగుతారు. ఎంత క్వాంటిటీ తాగాలి, ఏ సమయంలో తాగాలి అనేది తెలియక ఎదో ఒక సమయంలో పాలు తాగుతుంటారు.
పాలల్లో ఉండే కాల్షియం వలన ఎముకలు, దంతాలు దృడంగా తయారవుతాయి. సహజంగా కాల్షియం శరీరానికి లభిస్తుంది. విటమిన్-డి లభిస్తుంది. రక్తపోటు ఉన్నవారికి అదుపులో ఉంటుంది. రక్త సరఫరా మెరుగవుతుంది. కండరాలు నిర్మాణ మవుతాయి. కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. పాలల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. కండరాల కదలిక సక్రమంగా ఉంటుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.
ఉదయం అల్పహారం తిన్న తరువాత తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే విదంగా రాత్రి నిద్రపోయో ముందు తాగితే నిద్ర సమస్య ఉండదు. ఉదయం వ్యాయామం అనంతరం కూడా పాలు తాగవచ్చు. ఎవరైనా ఉదయం అల్ఫాహారం తరువాత, లేదంటే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యవంతంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.