Elachi Benefits : భోజనం చేసిందంటే ఒక కిల్లి దవడ కింద పడాల్సిందే. అప్పుడే తృప్తి. లేదంటే కనీసం రెండు భాగాలైనా నవలాలి. ఇంకా చెప్పాలంటే ఒక చెంచెడు సోంపు అయినా తినాలి. అప్పుడే మనసు నిమ్మలం అవుతుంది. వీటితో ఉన్న లాభాల కంటే మెరుగయిన లాభాలు ఇంకో పదార్థంతో ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ వీటితో పాటు ఇంకొకటి ఉంది చెప్పాలంటే. రెండు యాలకులు . అవే రెండు ఇలాచీలు తింటే మన శరీరం ఎలా ఉంటదో ఇప్పుడు తెలుసుకుందాం….
భోజనం చేసిన తరువాత రెండు యాలకులు తింటే మన శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. రెండు యలకులతో జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్ట్రబుల్ సమస్య పరిస్కారమవుతుంది. ఎసిడిటిని నివారించడంలో సహకారం అందిస్తుంది. యాక్సిడెంట్ల తో నిండుకుంటాయి. చెడుకొలెస్ట్రాలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతంను అదుపులో ఉంచుతుంది. రక్త సరఫరాకు సహాయకారిగా ఉంటుంది. కంటి చూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి కావలసిన విటమిన్లను అందిస్తాయి.