Expire Beer : మద్యం ప్రియులకు బీరు, బ్రాందీ ప్రాణ స్నేహితులతో సమానం.ప్రాణ స్నేహితులను విడిచి ఉండలేరు. అదేవిదంగా బీరు లేదా బ్రాందీ తాగకుండా ఉండలేరు. బీరు, బ్రాందీ కొనే ముందు ఎక్స్ పైర్ తేదీ, తరుచేసిన తేదీ రెండూ చూస్తారు. బ్రాందీ పాతది కాబట్టి ధర కూడా ఎక్కువే అని చెబుతారు పలువురు యజమానులు. పాత బ్రాందీ అయితే అంత ఇష్టంగా సేవిస్తారు కొందరు మద్యం ప్రియులు. పండుగ సీజన్ లలో కొందరు వ్యాపారులు ఎక్స్ పైర్ అయిన బీర్ లను ఎక్స్ పైర్ కానీ బీర్ లతో కలిపి అమ్ముతారు. అటువంటప్పుడు గమనించాల్సి ఉంటుంది. గడువు ఉన్న వాటితో పాటు, గడువు లేని బీర్లను కలిపి తాగితే ప్రాణానికి ముప్పు తప్పదు.
బీరు కొనేముందు దాని ఎక్స్ పైర్ తేదీని ఖచ్చితంగా చూడాలి. బీరు ఎక్స్ పైర్ తేదీ సాధారణంగా ఆరు నెలలకు మించి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బీరు తాయారు తేదీ, గడువు తేదీని చూసుకొని కొనుగోలు చేయాలి. ఎక్స్ పైర్ తేదీ దాటితే కొనుగోలు చేయరాదు. తేదీ ముగిసిందంటే బీరు మెల్ల,మెల్లగా విషమంగా మారుతుంది. అటువంటి బీరు తాగితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు యజమానులు మాత్రం ఎక్స్ పైర్ అయినా తాగవచ్చు అని చెబుతారు. కానీ అటువంటి మాటలు నమ్మరాదు. బీరు కొనేటప్పుడు ఖచ్చితంగా తయారు తేదీ, ఎక్స్ పైర్ తేదీ చూసుకోవాలి.
బీరు లో ఆల్కహాల్ ఉన్నా చెడిపోతుంది. కానీ బ్రాందీ పాడవదు. ఆ రెండింటిని తయారు చేయడంలో విధానాలు వేరు,వేరుగా ఉంటాయి. బ్రాందీ లో ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. బీరు మాత్రం ఆరు నుంచి ఎనిమిది శాతం ఆల్కహాల్ తోనే తయారవుతుంది. బీరు తయారీలో గింజలు మాత్రమే వాడుతారు. అందుకే బీరు కొంతకాలానికే నిల్వ ఉంటుంది. తొందరగా చెడిపోతుంది. కాబట్టి బీరు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్ పైర్ తేదీని చూసుకొని కొనుగోలు చేయాలని సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎక్స్ పైర్ బీరు అమ్మితే సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.