Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా హీరో వెంకటేష్ కు సంక్రాంతి పండుగనే మరిపించే సింది. వెంకీ మామ కు ఇప్పటి వరకు దక్కని క్రేజీ ఈ సినిమాతోనే దక్కింది. సంక్రాంతి కి వచ్చిన డాకు మహారాజ్, గేమ్ చేంజర్, పుష్ప-2 సినిమాలు రావడం జరిగింది. ఈ సినిమాల దాటికి తట్టుకుంటుందా అనే అనుమానాలు సైతం వెంకీ మామ సినిమా బృందానికి కలిగాయి. కానీ ఆ అనుమానాలు తేలిపోయాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర బృందం తో పాటు పెట్టుబడి దారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ కలెక్షన్ లు ఊహించిన దానికంటే ఎక్కువగానే రావడంతో సంబరపడిపోతున్నారు. విడుదల అయిన మొదట్లో కలెక్షన్లు మందకొడిగా సాగాయి. కానీ కొద్దీ రోజుల్లోనే వసూళ్ల పర్వం ఊపందుకొంది. రోజు, రోజుకు వసూళ్లు పెరగడంతో వెంకిమామ సంతోషానికి అవదులు లేకుండా పోయింది.
ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ : 270 కోట్లు దాటిపోయింది. కొద్దీ రోజుల్లోనే రోజుల్లోనే రూ: 300 కోట్లు దాటుతుందని చిత్ర బృందంతో పాటు, పెట్టుబడిదారులు కూడా ఆశిస్తున్నారు. ఈ కలెక్షన్ ల రికార్డ్ హీరో వెంకటేష్ కు సరికొత్త రికార్డ్ అని తెలుగు పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది.