Watch : కొందరు చేతి గడియారం అందం కోసం ధరిస్తారు. మరికొందరు సమయం తెలుసుకోడానికి కొంటారు. ఇంకొందరు చేతికి గడియారం ఉంటె సరిపోతుంది అనడం కోసం కొంటారు. వీరంతా కూడా మామూలు ధరతో ఉన్న గడియారాలను కొంటారు. కానీ సెలబ్రిటీలు కొనుగోలు చేసే గడియారాల ధర మాత్రం లక్షల్లో ఉంటుందనేది చాలా మందికి తెలుసు. ఇకపోతే చిత్ర పరిశ్రమ నటీ, నటులు మాత్రం ఒక్క గడియారంతో సరిపెట్టుకోరు. కనీసం ఐదు గడియారాలు అయినా ఉంటాయి. వాటి ఖరీదు కూడా భారీగానే ఉంటుంది.
ఇప్పుడు ఒక హిందీ చిత్ర పరిశ్రమ నటుడు ఇటీవల ఒక చేతి గడియారాన్ని కొన్నాడు. ఆయన కొన్న గడియారం చాలా ఖరీదయినదని హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్. ఆ నటుడు ఎవరంటే షారుక్ ఖాన్. ఈయన వద్ద ప్రస్తుతం ఐదుకు పైననే ఖరీదయిన చేతి గడియారాలు ఉన్నాయని సమాచారం. తనకు ఇష్టమయిన గడియారాన్ని సందర్భాన్ని బట్టి పెట్టుకుంటాడని తెలిసింది.
ఆయన తన చేతికి పెట్టుకున్నగడియారం అడెమర్స్ పిగట్ బ్రాండ్. ఇది 18 క్యారెట్ స్యాండ్ గోల్డ్ తో తయారవుతుంది. ఇలాంటి గడియారాలు పదుల సంఖ్యలోనే తయారవుతాయి. ఇప్పుడు ఆ గడియారం ఖరీదు అక్షరాలా రూ. 76 లక్షల పైనే. దీంతో ఈ వాచ్ ఖరీదు తెలియడంతో చిత్ర పరిశ్రమలో షాకవుతున్నారు.