Marriage Stars : వెండితెరపై అడుగు పెట్టిన ప్రతి హీరోయిన్ తనదయిన ముద్ర వేసుకుంటుంది. గుర్తింపుతో వెండి తెరను ఒక ఊపు ఊపు ఊపుతారు. పెళ్లి అయ్యే వరకు చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు కొందరు వెండితెర భామలు. కానీ పుట్టినింటిలో ఉండి వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన తారలు మెట్టినింటికి వెళ్లిన తరువాత కూడా తగ్గేదేలే అంటున్నారు. ఇంటిపేరు మార్చుకున్న భామలతో కుర్ర భామలు నిలబడలేకపోతున్నారు. మెట్టినింటికి వెళ్లిన భామలు గతంలో అక్క, వదిన పాత్రలతో సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు తాళి కట్టుకున్న తరువాత కూడా తగ్గేదెలా అంటున్నారు హీరోయిన్స్ . పెళ్లైన కూడా అవకాశాలు మెట్టినింటికి వరుస కడుతున్నాయి.
పెళ్లిచేసుకున్నవారిలో నయనతార, అలియాభట్, కత్రినా, దీపికా, కియారా, రకుల్ ఇలా కొందరు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మలల్లో ఒకరి ఉదాహరణ తీసుకొంటే నయనతార కు తీరిక లేకుండా చేతిలో సినిమాలు ఉన్నాయి. కాజల్ కూడా తీరిక లేకుండా కెమెరా నే అంటిపెట్టుకొని ఉంది. విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత ఫుల్ బిజీ అయిపోయింది. రకుల్ ప్రీతి సింగ్ పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ లో కూడా పెళ్లైన భామల సందడి కొనసాగుతూనే ఉంది. అలియాభట్, దీపికా, కత్రినా వంటి హీరోయిన్ లకు పెళ్లి తరువాత కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అవకాశాలు ఏమాత్రం తగ్గక పోవడం విశేషం. కియారా అడ్వాణీకి తెలుగులో క్రేజి తగ్గలేదు. పెళ్లి తరువాత అవకాశాలను వదులు కోవడంలేదు. వచ్చిన వారితో మనుకుంటాము అని చెప్పడంలేదు. అత్తగారింటికి వెళ్లినా ఇంకా అవకాశాలు కావాలనే ఆశతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికి పుట్టినింటిలో హవానే, మెట్టినింటిలో కూడా వాళ్ళ హావ కొనసాగడం విశేషం.