NTR DEVARA : ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ హిట్ సాధించింది. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ చాల రోజులు కెమెరా ముందుకు రాలేదు. ఆయన అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న సరికొత్త చిత్రం ” దేవర “. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడిగా నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నది. పెట్టుబడిదారులు భారీ బడ్జెట్ కేటాయించారు. దేవర ను మాత్రం రెండు భాగాలుగా నిర్మించడానికి సిద్ధమయ్యారు. రెండు భాగాలుగా రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఆర్ఆర్ఆర్ తరువాత మేకప్ వేసుకుంటున్న ఎన్టీఆర్ తన అభిమానులకు దేవర తో పెద్ద బహుమతి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన పక్క మాస్ యాక్షన్ తో అభిమానులతో సందడి చేయడానికి సిద్దమయ్యారు. కొరటాల శివ కు ఆచార్య సినిమా పెద్ద గుణపాఠం ఆ అయ్యింది. దాంతో దేవర నిర్మాణంపై కొరటాల శివ ఒకటికి, పదిసార్లు అలోచించి కెమరాతో కలిసి అడుగులు వేస్తున్నారు. దేవరకు సంభందించిన పోస్టర్లు, గగ్లిమ్ప్స్ లను విడుదల చేసి అభిమానులకు కానుకగా అందజేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ సాధించింది. వీరిద్దరి కాంబినేషన్ లో దేవర రావడంతో అభిమానులు కూడా పెద్దగా ఆశలు పెట్టుకున్నారు.
దేవర సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 10 న విడుదల చేయడానికి సినిమా సాంకేతిక వర్గం సిద్ధమవుతోంది. సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇదే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. ఆయన పుట్టిన రోజు అంటే అభిమానులకు పెద్ద పండుగతో సమానం. అదే రోజున దేవర సినిమాకు సంబంధించిన సన్నివేశాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రం సాంకేతిక వర్గం.
యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొసరాజు హరి కృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేయడం విశేషం. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. దాదాపుగా ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ తెరమీద కనిపించడంతో ఆయన అభిమానులు భారీ ఆశలతో ఉన్నారు.
———————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
———————