sridevi : ప్రముఖ నటి తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగు సినిమాల్లోకి ఆమె వచ్చే నాటికీ జయప్రద, జయసుధ పరిశ్రమను ఏలుతున్నారు. వీళ్ళతో పోటీని తట్టుకొని చిత్ర పరిశ్రమలో తన సత్తా ఏమిటో చూపించింది శ్రీదేవి. అయితే శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకే హీరోతో మనవరాలిగా, ప్రియురాలిగ, భార్యగా నటించి మెప్పించింది. ఆ హీరో ఎవరంటే…..
తెలుగు చిత్ర పరిశ్రమకు వెన్నుముకలా నిలిచిన ఎన్టీ రామారావు చలన చిత్ర రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. క్లాస్, మాస్, పౌరాణికం, రాజకీయం ప్రధాన కథలకు సంబందించిన పాత్రల్లో నటించారు. ఆయన తరువాత తన వారసులను కూడా సినిమా రంగంలోకి కొందరిని తీసుకు రావడం జరిగింది.
శ్రీదేవి ఎన్టీ రామారావుతో కలిసి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించింది. జయసుధ, జయప్రద ఉన్నప్పటికీ నిర్మాతలు శ్రీదేవి, ఎన్టీ రామారావు తోనే పదుల సంఖ్యలో సినిమాలు తీశారు. అయితే ఎన్టీ రామారావుతో కలిసి శ్రీదేవి బడి పంతులు సినిమాలో మనవరాలిగా నటించింది. ఆ తరువాత వేటగాడు, సర్దార్ పాపారాయుడు, అగ్గి రవ్వ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి సినిమాల్లో ఎన్టీ రామారావుతో కలిసి ప్రియురాలిగా, భార్యగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా రికార్డులు సృష్టించింది.