Heroien : సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం. అందులో చేరిన వారు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. కొందరు పోటీ తట్టుకోలేక ఇంటికే పరిమితం అవుతారు. చిన్న వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎదిగిన అందాల ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు 16 ఏళ్లకే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఏడాదిలోనే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా నటించారు.
తీరిక లేకుండా షూటింగ్ లో మునిగి పోయారు ఆ అందాల భామ. ఒక్క సంవత్సరంలోనే 12 సినిమాల్లో నటించి బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొన్నారు. కానీ దురదృష్టవశాత్తు భవనం పై నుంచి పడిపోయి చనిపోయారు. ఆమె ప్రమాదవ శాత్తు పడిపోయారా ? లేదంట భవనం పై నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుందా..? ఎవరైనా పై నుంచి తోసేశారా అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో నేటికీ మిస్టరీగానే మిగిలి పోయింది.
బొబ్బిలి రాజా సినిమాలో హీరో వెంకటేష్ సరసన నటించిన హీరోయిన్ దివ్య భారతి. ఆ సినిమానే దివ్య భారతి కి మొట్టమొదటి సినిమా. ఈ అందాల ముద్దుగుమ్మనే 16 ఏళ్లకు సినిమా పరిశ్రమలో చేరింది. అంచలంచెలుగా పోటీని తట్టుకొని తన ఇమేజ్ ను పెంచుకొంది. ఒకే ఏడాదిలో 12 సినిమాల్లో నటించడం అంత సాధారణమైన విషయం కాదు. అంత గొప్ప నటి చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లి అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె అభిమానులు నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.