Nagachaitanya : ప్రముఖ తెలుగు హీరో నాగార్జున వారసుడు, హీరో నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్నది తెలిసిన విషయమే. నాగ చైతన్యకు ఇప్పుడుతను ప్రేమించిన సినిమా నటి శోభిత తో గురువారం నిశ్చితార్థం జరిగింది. హీరో నాగార్జున నిశ్చితార్తం ఫొటోలో సోషల్ మీడియాలో పెట్టేవరకు ఈ విషయం ఎవ్వరికి తెలియదు. కానీ వారిద్దరూ ప్రేమించుకుంటున్న విషయంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ నిజమెంతో తెలియక ఎవ్వరు కూడా బయట పెట్టలేదు. ఒక్కసారిగా నిశ్చితార్తం ఫోటోలు బయటకు వచ్చేసరికి అభిమానుల అనుమానాలు నిజమయ్యాయి.
హీరోయిన్ శోభిత వాస్తవానికి తెలుగు అమ్మాయి. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో పుట్టి పెరిగింది. తల్లి ఉపాధ్యాయురాలు. తండ్రి మర్చంట్ నేవీ ఇంజనీర్. మొదటి నుంచి కూడా వీళ్లది సంపన్నమైన కుటుంబం. శోభిత మొదటి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నది. 2013 లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. మొదటి సారి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించింది. ఆ తరువాత గూఢచారి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.
శోభిత తండ్రికి వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని పరిశ్రమలో పెద్ద టాక్. ఇవి కాకుండా మిగతా ఆస్తుల విలువ కూడా వందల కోట్లలోనే ఉంటుందని సినీపరిశ్రమ సమాచారం. శోభిత కూడా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తరువాత పది కోట్ల పైననే సంపాదించిందని తెలుస్తోంది. ఒక్కో సినిమాలో కోటి రూపాయల పారితోషకాన్ని తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.