Ram charan : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్. ఈ సినిమా కౌంట్ డౌన్ మొదలైనది. సినిమా జనవరి పదోతేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అభిమానులు గేమ్ ఛేంజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు రామ్ చరణ్ శుభవార్త చెప్పబోతున్నారు.
ఇటీవలనే గేమ్ చెంజర్ సినిమాను సెన్సార్ బోర్డు పరిశీలించింది. సినిమా ఒక రేంజ్ లో అదిరిపోయే విదంగా ఉందనే టాక్ అయితే సెన్సార్ బోర్డు నుంచి వచ్చింది. ఇంటర్వెల్ తరువాత సినిమా దద్దరిల్లిపోయేవిదంగా ఉంటుందని చిత్ర బృందం అంటోంది.
సినిమా ప్రేక్షకులను రెండు గంటల నలభయ్ అయిదు నిముషాలు అలరించనుంది. గేమ్ చేంజర్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ కూడా వచ్చిందని చిత్ర బృంద సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ లల్లో టికెట్ ధరలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అదేవిదంగా అడ్వాన్స్ షో లకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడి దారులు ఆందోళనలో ఉన్నారు.