marriage : ఆమె నటనకు తిరుగులేదు. సహజ నటి అనే పేరు ఉంది. ఒకరిని వివాహం చేసుకోగా విడాకులు తీసుకొంది. ఆ తరువాత మరొకరిని వివాహం చేసుకోగా అతను మరణించాడు. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటించిన ఆ నటి ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుందని తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఆ నటి ఇప్పటి వరకు కూడా మూడో పెళ్లి చేసుకున్నట్టుగా వస్తున్న వార్తలను మాత్రం ఆమె ఖండించక పోవడం విశేషం. ఇంతకు ఆమె ఎవరు అంటే జయసుధ. ఆమె చిరంజీవితో కలిసి మగధీరుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ సోదరుడితో మొదటి పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వలన జయసుధ అతనితో విడాకులు తీసుకొంది. 1985 లో హిందీ నటుడు జితేంద్ర బంధువు, నిర్మాత నితిన్ కపూర్ ను రెండో వివాహం చేసుకొంది. నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడు 2017 లో . అప్పట్లో అయన మరణం తెలుగు, హింది చిత్ర పరిశ్రమలో సంచలనం అయ్యింది. అయన మరణం తరువాత ఒంటరిగానే ఉంటుంది. ఇద్దరు కొడుకులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.
ఇప్పుడు జయసుధ మూడో వివాహం చేసుకున్నదనే వార్తలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఆమె వయసు ఇప్పుడు సుమారుగా 64 ఏళ్ళు. విదేశీ వ్యాపారవేత్తను మూడో పెళ్లి చేసుకున్నట్టుగా చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. కానీ ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయినా జయసుధ స్పందించడం లేదు. ఆమె తన పెళ్లి వార్త గురించి వస్తున్న వార్తలను కండించే వరకు వేచిచూడాల్సిందే.