Cinema Release : భారీ అంచనాలతో ఏడాదిపాటు కస్టపడి సినిమా నిర్మించారు.భారీ బడ్జెట్ కేటాయించారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, హీరోగా ప్రధాన పాత్ర పోషించి నిర్మించాడు ఆ హీరో. ముహూర్తం ప్రకారం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నది చిత్ర బృందం. కానీ దురదృష్టవశాత్తు ఒక ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా బృందం రిలీజ్ వాయిదా వేసుకొంది. ఇంతకు ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరు ? ఆ సినిమా పేరు ఏమిటి ? ఆ సినిమా దర్శకుడు,నిర్మాత, రచయిత, హీరో ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ ఖుర్ భాని సినిమాను నిర్మించాడు. ఆ సినిమాకు రచయిత, దర్శకుడు, నిర్మాత ఆయనే కావడం విశేషం. 1979 లో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సినిమాకు రు 1.55 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రత్యేక సెట్ వేయడానికి 5.3 లక్షలు ఖర్చు చేశారు. షూటింగ్ కోసం ఆరోజు ప్రత్యేకంగా 23 లక్షల రూపాయలతో కొత్త కెమెరా కొనుగోలు చేశారు. సినిమా షూటింగ్ సన్నివేశంలో వాడే కత్తిని నిజమైన వెండి కత్తినే కొనుగోలు చేశారు. దాని ఖరీదు రు : 16,590. అంతే కాదు సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఆరోజుల్లోనే బెంజ్ కారు కొనడం విశేషం.
నిర్మాత, హీరో అయిన ఫిరోజ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించాలని హీరో అమితాబ్ బచ్చన్ ను అడిగితే ఆరు నెలల తరువాత నటించడానికి అంగీకరించాడు. దింతో అయన స్థానంలో వినోద్ ఖన్నాను తీసుకున్నాడు. సినిమా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఊపునిచ్చింది. సంగీతం, ఫైట్, పాటలు ఆరోజుల్లో అభిమానులకు, ప్రేక్షకులకు ఫుల్ జోష్ నింపాయి. అందులో లైలా మే లైలా అనే పాట ఎక్కడ చూసినా వినిపించేది. ఆ సినిమాకు రెండు ఫిల్మ్ వేర్ అవార్డు లు రావడం విశేషం.
సినిమా పూర్తి చేసి 23 జూన్, 1980న విడుదల చేయడానికి 20 జూన్,1980న అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చిత్ర బృందం. విడుదలకు అన్ని ఏర్పాట్లు దేశ వ్యాప్తంగా పూర్తి చేసుకున్నారు. 23న విడుదల చేయాలనుకున్న చిత్ర బృందానికి విషాద సంఘటన ఎదురైనది. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మృతి చెందాడు. దింతో సినిమా విడుదల వాయిదా వేసుకున్నారు. తిరిగి 27 జూన్, 1980న సినిమా విడుదల చేశారు.