Actor Ali : తెలుగు సినీ నటుడు అలీ కి హైదరాబాద్ లో సంబంధిత శాఖల అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్ శివారులో ఆలీకి ఫామ్ హౌస్ ఉంది. అందులో సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ శివారులోని ఏక్ మామిడి పరిధి సర్వ్ నెంబర్ 345లో ఫామ్ హౌస్ ఉంది. అందులో సంబంధిత అధికారుల అనుమతి పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇటీవల అలీ కి నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. నిర్మాణాలకు సంబందించిన డాకుమెంట్స్ అందజేసి అనుమతులు పొందాలని అధికారులు కోరారు.
అనుమతి పొందకుంటే పంచాయత్ రాజ్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. నటుడు అలీ కూడా సంబంధిత డాకుమెంట్స్ తో అధికారులను సంప్రదించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.