Sunday : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి రోజు చేసే పూజలకు ఒక ప్రత్యేకత ఉంది. వారంలో ఏడురోజులు కొందరు తమ ఇలవేల్పుకు పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. కానీ ఆదివారం రోజు సూర్యభగవానుడికి పూజలు చేస్తే ఆ కుటుంబానికి ఆరోగ్యం, సిరి సంపదలు సమకూరుతాయి.
సూర్యభగవానుడికి ఎరుపు రంగు చాలా ఇష్టం. ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే ప్రతిఫలం లభిస్తుందని వేదంలో చెప్పబడింది. అదేవిదంగా పేదవారికి ఎరుపు రంగు దుస్తులు దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది.
కుటుంబం సుఖసంతోషాలతో గడపడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఐశ్వర్యం అభివృద్ధి చెందాలంటే ఆదివారం రోజు రావిచెట్టు వద్ద దీపం పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు వద్ద పిండితో చేసిన దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో వెలిగించాలి.
ఆదివారం రోజు ఎర్రచందనం కుంకుమ బొట్టు పెట్టుకున్న తరువాతనే పని చేయడం మొదలు పెట్టాలి. సూర్య దేవుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఈ విదంగా చేయడం వలన చేస్తున్న పనిలో ప్రగతి ఉంటుంది.
ఆదివారం రోజు ఇంటిలో తయారు చేసిన నెయ్యితో ఇంటి ముందర దీపం వెలిగించాలి. ఈ విదంగా వెలిగించడం వలన అప్పుల భాద నుంచి విముక్తి కావడానికి అవకాశాలు ఉన్నాయని వేదంలో చెప్పబడింది.