కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రోగ్రాం ఒక్కటే. కానీ ఆ ప్రోగ్రాంలో పాడే పాట కూడా ఒక్కటే. ఆ ఒక్క పాటకు ఆ సింగర్ తీసుకునే పారితోషకం విషయంలో తగ్గేదెలా అంటున్న సింగర్ ఎవరో తెలుసా ??ఆమె తీసుకునే పారితోషకం కూడా ఎంతో తెలిస్తే షాక్ గురవ్వాల్సిందే.పదిహేడేళ్లకే గాయనిగా అడుగుపెట్టింది. అంతః చిన్న వయసులోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఆరేళ్ళ వయస్సులోనే సంగీతం తో తన గాణ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు.కేరళ రాష్ట్రస్థాయి నాలుగు అవార్డులు,ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,రెండుసార్లు తమిళనాడు రాష్ట్ర స్థాయి ఫిల్మ్ అవార్డులు అందుకున్న గాయని ఆమె.ఇంతకీ తాను ఒక్క పాట పాడితే ఎంత తీసుకుంటదంటే, అక్షరాలా ఇరువై ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుందని సినీవర్గాల సమాచారం.అందులో తెగ్గేదేలే అంటున్న ఆ ఫేమస్ సింగర్ పేరు ఏమిటంటే శ్రేయ ఘోషల్. ఇప్పుడు ఆ శ్రేయ ఘోషల్ సింగర్ ను భారత దేశంలోనే టాప్ సింగర్ అని చెప్పక తప్పదని సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది.
దక్షిణాదిలో ఘోయల్ టాపర్…..
ఆమె పాట పాడుతున్న నేపథ్యంలో గానంలో కానీ, గాత్రంలో కానీ, సప్తస్వరాలు పరంగా కూడా దోషాలు తీయడం సీనియర్ సింగర్లకు కూడా సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది.ఘోయల్ గత 23 ఏళ్ల నుంచి మనదేశ చిత్రాలకు పాటలు పాడుతోంది.ఆమె పాడే ఒకే ఒక్క పాట కోసం ఇరువై ఐదు లక్షల రూపాయలను తీసుకోవడంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గదని [రాచరం ఇండస్ట్రీ లో ఉంది.అత్యధికంగా పారితోషం తీసుకుంటున్న భారత దేశపు టాప్ గాయని కూడా ఈమె కావడం విశేషం. అంతే కాదు దక్షిణాసియాలో ఉన్న సింగర్లల్లో ఈమె కూడా ఉత్తమ సింగర్ గ స్థానం సంపాదించుకోవడం విశేషం.ఒక్క భాష తో నే గాయనిగా సరిపెట్టుకోలేదు. అవకాశం ఏ భాషలో వస్తే ఆ భాష సినిమాలను సద్వినియోగం చేసుకొని టాపర్ గా నిలిచింది. హిందీ సినిమాలతో పాటు ఉర్దూ,మలయాళం, తమిళం,బెంగాలీ, పంజాబీ,భోజ్ పురి భాషా సినిమాలతోపాటు విదేశీ భాషల్లో తీసిని సినిమాలకు కూడా పాటలు పాడి తన నైపుణ్యాన్ని చాటుకోవడం విశేషం.20 కి పైగా భాషల్లోని సినిమాల్లో మూడు వేలకు పైగా [పాటలు పాడింది శ్రేయ ఘోయల్. అదేవిదంగా వాటిలో అత్యధికంగా పదకొండు వందలకు పైగా పాటలు పాడి ఇండియాలో టాప్ సింగర్ గ శ్రేయ ఘోయల్ నిలవడం విశేషం.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-