సీ అండ్ ఎండీ కి అభినందనలు
రాజకీయాలకు అతీతంగా బదిలీలు
————-
కోల్ బెల్ట్ న్యూస్:కొత్తగుడెం
————–
సింగరేణిలో కొత్త గనుల నిర్మాణం చేపట్టి సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం స్పష్టం చేసారు.అధికారులు,సూపర్ వైజర్లు,అధికారులు సంయుక్తంగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్బంగా సి అండ్ ఎండి ని కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సన్మానించారు.ఈ సందర్బంగ సింగరేణి అపరిష్కృత సమస్యల పరిస్కారంతోపాటు సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందేన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య చైర్మన్ బలరాంతో మాట్లాడుతూ కొత్త గనుల నిర్మాణం చేపట్టాలని, సంస్థలో ఖాళీగా ఉన్న అంతర్గత పోస్టులను సర్వీసులో ఉనన్వారితోనే భర్తీ చేయాలన్నారు. పదోన్నతులు రానివారికి కూడా పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.సంస్థలో బదిలీలు,పదోన్నతులు సంస్థ నిబంధనల ప్రకారం జరగాలని, వాటిలో రాజకీయ జోక్యాలకు అవకాశం ఇవ్వరాదని కోరారు.2024-2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి గుర్తింపు సంఘం కూడా సహకరించాలని చైర్మన్ బలరాం ఈ సందర్బంగా యూనియన్ నాయకులను కోరారు.వీకే 7 గని, తాడిచెర్ల గనికి త్వరలోనే అనుమతులు రానున్నాయని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ,ప్రధాన కార్యదర్శి కే రాజకుమార్ ,అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిరియాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే సారయ్య ,వైవి రావు, కే వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎలాగౌడ్ మరియు పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు లు పాల్గొన్నారు