మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
బీజేపీని గద్దె దించుతామంటున్న ఖర్గే
———–
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
———–
భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణగదొక్కుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.తన చేతిలో ఉన్న సీబీఐ,ఈడీ లతో దాడులు చేయిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను భయానికి గురిచేస్తోందన్నారుఢిల్లీలో శుక్రవారం పార్టీ న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఇండియా కూటమి కాని, కాంగ్రెసుపార్టీ కానీ తాయారు చేసింది కాదని,ఇది ప్రజలు తయారు చేసిన మేనిఫెస్టో అని ఖర్గే స్పష్టం చేశారు.ఈ మేనిఫెస్టో రైతులు,మహిళలు,శ్రామికుల మేనిఫెస్టో అని అన్నారు.ఉద్యోగాల కల్పన,సంపద సృష్టి,సంక్షేమం సూత్రాలపై ఈ మేనిఫెస్టో తయారుచేయడం జరిగిందన్నారు.భారతీయ జనతా పార్టీ నిధులు సమకూర్చుకున్న విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు పోగుచేసుకొని,ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు.
బీజేపీతో పోరాటమే లక్ష్యం……
ఈ ఎన్నికలు 2024లో జరుగుతున్న ఎన్నికలు కాదని,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధం అన్నారు.బీజేపీ పాలనలో ప్రజలకు ఈ విదంగా మేలు జరిగిందో ఆ పార్టీ చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగామని అన్నారు. ఇండియా కూటమిలో ప్రధానమంత్రి ఎవరనేది కొందరికి అనుమానంగా ఉన్నదన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్రజలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులకు విజయాన్ని అందించిన తరువాత ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి నిర్ణయిస్తామన్నారు.ఇండియా కూటమికి అప్పటి వరకు విజయం కోసం బీజేపీ తో పోరాటమే చేయడమే లక్ష్యమన్నారు.