2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
ధనుస్సు రాశి
మూల,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,1వ పాదం
ఆదాయం 11, వ్యయం
రాజపూజ్యం 7,అవమానం 5
బృహస్పతి అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.అవివాహితులకు ఉత్తమ ఇల్లాలుతో వివాహం. ఇంటిదేవత వలన సుఖం,సంతోషం,ఆరోగ్యం దొరుకుతుంది.ఇల్లాలే ఇంటి దేవత. ఈ రాశివారు తమ భార్యను ఎంతగ ఆదరిస్తారో,అంత శాంతి ఉంటుంది ఆ ఇంటిలో.భర్త కు భారం కాకుండానే పిల్లలను తీర్చి దిద్దుతుంది.పొదుపుతో ఆర్థికంగా కుటుంబాన్ని బలోపేతం చేస్తుంది.ఉద్యోగంలో అధికార యోగం ఉంది.వ్యాపారస్తులకు మే వరకు మంచి లాభాలు వస్తాయి. భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంది. మీ నమ్మకమే మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది.మే వరకు ఆర్థిక యోగం బాగుంటుంది. రైతులకు పంట దిగుబడి పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. భూమి,ఇల్లు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.విదేశీప్రయాణం అనుకూలంగా ఉంది.