Home » mla komatireddi ; బ్రాందీ షాప్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే .

mla komatireddi ; బ్రాందీ షాప్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే .

mla komatireddi ; సాధారణంగా ఎమ్మెల్యేలు విద్యాసంస్థలను తనిఖీ చేస్తారు. హాస్టల్ ను తనిఖీ చేస్తారు. ఇంకా చెప్పాలంటే రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తారు. ఆకస్మికంగా ఎదో ఒక ప్రభుత్వ సంస్థను తనిఖీ చేసి మీడియా కు చర్యలు తీసుకున్నట్టుగా చెబుతారు. ఒక ఎమ్మెల్యే విచిత్రమైన తనిఖీ చేపట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఎమ్మెల్యే బ్రాందీ దుకాణం తనిఖీ చేస్తున్నారని తెలిసి మీడియా కూడా పరుగులు పెట్టింది. ఎమ్మెల్యే తనిఖీ చేసింది పట్టపగలే కావడం విశేషం. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరంటే ?

 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటి రెడ్డి. నిత్యం వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే. తన నియోజకవర్గాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో నిలపాలని ఆశిస్తున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యే బ్రాందీ షాప్ ను తనిఖీ చేసి నియోజక వర్గం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

మునుగోడు పట్టణంలోని బ్రాందీ షాప్ ను ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్ లోని మద్యం బాటిళ్లను పరిశీలించారు. తయారైన తేదీ, ధర పరిశీలించారు. నకిలీ బ్రాందీ, బీరు అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ తనిఖీ చేశారు. అదే సమయంలో కొందరు ఆ పర్మిట్ రూంలో మద్యం సేవిస్తున్నారు. పట్టపగలే మద్యం తాగడం ఏమిటి అంటూ వాళ్లకు క్లాస్ తీసుకున్నారు. వాళ్ళను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పగటి పూట పర్మిట్ రూంకు అనుమతి ఇవ్వొద్దు అంటూ యజమానిని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *