Inter : విద్యాభివృది కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనేక సంస్కరణలు తీసుకు వస్తోంది. అయినా పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. 2020 లోనే ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు సైతం జారీ చేసింది. అయినప్పటికీ నేటికి కూడా ఏడూ రాష్ట్రాలు నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం లేదు. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం విశేషం.
ప్రస్తుతం తెలంగాణ లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ విద్య అమలవుతోంది. ఈ విధానాన్ని తొలగించి ఐదో తరగతి వరకు ప్రైమరీ, 8వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ విద్యా విధానం భోదించే విదంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక దశలో ఐదేళ్లు అంగన్ వాడీ, ప్రీ స్కూల్ మూడేళ్లు 1,2 తరగతులు ఉంటాయి. ఆ తరువాత మూడేళ్లు 3,4, 5 తరగతులు నిర్వహించాలి. అనంతరం మూడేళ్లు 6,7,8 తరగతులు బోధించాలి. చివరగా నాలుగేళ్లు 9,10,11,12 తరగతులు బోధించాలి.
దేశంలో ఏడు రాష్ట్రాల్లో నూతన విద్యావిధానం అమలు కావడంలేదు. అందులో తెలంగాణ కూడా ఉంది. నూతన విద్యావిధానాన్ని ఎందుకు అమలు చేయడంలేదని అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అప్పటి ప్రభుత్వం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం అమలుచేయాలన్న విద్యా విధానం అమలుపై చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ చర్చల్లో కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటే వచ్చే ఏడాది నుంచే ఇంటర్ మీడియట్ విద్య మూసివేయక తప్పదు.