KTR : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయం గురించి సవాల్ విసిరినా కేసీఆర్ కే విసురుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత కు సవాల్ విసరడంలేదు. కానీ ఆ సవాల్ ను కేటీఆర్ పరిగణలోకి తీసుకుంటున్నారు. సీఎం కు కేసీఆర్ స్థాయిలేదు. చర్చకు నేనే వస్తా అంటూ పదే, పదే మీడియా ముందు చెప్పేస్తున్నారు. ఈ పరిణామం అంతా గమనిస్తే గుర్తింపు కోసమే ఆరాటపడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యకమవుతున్నాయి.
రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి ఇటీవల సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేటీఆర్ ఇదే విషయంపై స్పందిస్తూ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు తెరలేపారు. కేసీఆర్ కు సీఎం సవాల్ విసిరిన ప్రతిసారి తానే వస్తానంటున్నారు కేటీఆర్. రేవంత్ కు నాయకుడు సరిపోతాడంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గులాబీ శ్రేణుల్లో కూడా కొందరు కేటీఆర్ మాటలతో ఇబ్బందిపడుతున్నారు.
బిఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి పేరు పలకడానికి కూడా కేసీఆర్, కేటీఆర్ ఇష్టపడలేదు. అధికారం కోల్పోయాక ఇతర పార్టీల కంటే కేటీఆర్ ఎక్కువగా రేవంత్ జపం చేయడం విశేషం. నిత్యం సీఎం ను ఎదుర్కోడానికి ఆరాటపడుతున్న కేటీఆర్ ఉద్దేశ్యం కూడా వేరే ఉందంటున్నారు రాష్ట్రంలో. ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుల కంటే తనకే ఎక్కువ గుర్తింపు రావడానికే ఆరాటపడుతున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.